Pushpa-2 Movie Prediction : హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ To my blog, ఈ మధ్య ఎక్కడ చూసినా పుష్ప హవానే నడుస్తుంది మరో రెండు రోజుల్లో విడుదల అవుతుంది,
అయితే ఈ రోజు మన స్టైల్ లో పుష్ప 2 స్టోరీ ఏంటి అని ప్రెడిక్ట్ చేయబోతున్నాం. ఏదో నోటికి వచ్చిన సొల్లు చెప్పకుండా ప్రాపర్ గా ఫస్ట్ పార్ట్ లో మనకున్న డీటెయిల్స్ ని కనెక్ట్ చేస్తూ ఒక స్టోరీ ప్రెడిక్ట్ చేద్దాం blog చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది So blog ని లాస్ట్ దాకా చూడండి.lets start
ఒకసారి మనం పుష్ప పార్ట్ వన్ క్లైమాక్స్ సీన్ గుర్తు చేసుకుందాం మన పుష్ప చెన్నై మురుగం తో ఒక
పెద్ద డీల్ సెట్ చేసుకుంటాడు.అంతేకాకుండా మంగళం సీను వాళ్ళ బావని కూడా చంపేస్తాడు ఇవన్నీ చూసి మంగళం సీనుకి పుష్ప అంటే బాగా పగ పెరిగిపోతుంది..అలాగే పుష్ప ఎండింగ్ లో పుష్ప బన్వర్ సింగ్ శకావత్ ని చాలా అంటే చాలా అవమానిస్తాడు, బట్టలు తీసి నించోబెడతాడు,, ఈ దారుణమైన అవమానం వల్ల బన్వర్ సింగ్ కూడా పుష్ప మీద ఫుల్ గా పగ పెంచుకుంటాడు టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు..
ఇదే కోపంతో పుష్ప ఇచ్చిన డబ్బులు కూడా తగలబెట్టేస్తాడు. ఇదంతా అయ్యే టైం లో పుష్ప కి అండ్ శ్రీవల్లికి పెళ్లి కూడా జరుగుతుంది.దీంతో మన పార్ట్ వన్ ఎండ్ అవుతుంది…
ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చాలా లూస్ ఎండ్స్ ఉన్నాయి. పార్ట్ వన్ ఎండింగ్ లో నాకు తెలిసి ఇవన్నీ పార్ట్ టు లో కనెక్ట్ అవ్వబోతున్నాయి. అనిపిస్తుంది అయితే ఫస్ట్ మూవీ ఎండ్ కి పుష్ప మీద ఒక నలుగురు మాత్రం పగతో రగిలిపోతున్నారు వాళ్ళు ఎవరంటే తన తమ్ముడిని చంపాడు అని దాక్షాయిని, తనని లేవకుండా చేశాడు అని జారెడ్డి,తనని ఘోరంగా అవమానించాడు అని బన్వర్ సింగ్,ఇంకా మురుగన్ తో డీల్ సెట్ చేసుకొని తనని సిండికేట్ లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేశాడు అని మంగళసీను.
వీళ్ళ నలుగురు ఎప్పుడూ అవకాశం వచ్చిద్దా పుష్పని చంపే చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు.ఇప్పుడు పుష్ప 2 స్టోరీ గురించి మాట్లాడితే ఫస్ట్ మూవీ లో మాట్లాడుకున్నట్టు చెన్నై మురుగనికి సేఫ్ గా సరుకు సప్లై చేస్తూ ఉంటాడు.. పుష్ప అలా ఒక వన్ ఇయర్ ఇలా బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది. ఈ వన్ ఇయర్ లోనే పుష్ప చాలా అంటే చాలా డబ్బులు సంపాదిస్తాడు. అయితే ఇక్కడ పుష్ప కి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే నేనే వన్ ఇయర్ లో ఇంత సంపాదిస్తే చెన్నై మురుగన్ ఎంత సంపాదిస్తున్నాడు అని, అయితే ఈ విషయం మాట్లాడడానికి చెన్నై మురుగన్ దగ్గరికి మళ్ళీ వెళ్తాడు పుష్ప అయితే అక్కడ చెన్నై మురుగన్ కి కలవడం అక్కడ మనుషులు అడ్డుపడతారు.
ఇది చూసిన పుష్ప ఇంకా మంచి క్వాలిటీ ఉన్న ఎర్రచందన్ తీసి వాడి ముందు పెడతాడు. ఇది చూసిన మురుగన్ ఏం కావాలి నీకు నీకు ఆల్రెడీ లోడ్ కి కోటిన్నర ఇస్తున్నాను ఇంకేం కావాలి అని అడుగుతాడు..అప్పుడు పుష్ప నాకు నీతో పార్ట్నర్షిప్ కావాలి అంటాడు..ఎగ్జాక్ట్ గా ఇదే మనకి పార్ట్ వన్ లో కూడా జరిగింది..మన పుష్ప కి కమిషన్ మీద లోడ్ కి ఎంతో కొంత కమిషన్ కోసం అని పని చేయడం నచ్చదు..
అందుకే ఫస్ట్ పార్ట్ లో కూడా లోడ్ కి 5 లక్షలు అంటే వద్దు నాకు 4% చాలు అని పార్ట్నర్షిప్ అడుగుతాడు..సేమ్ ఇలాగే మురుగన్ దగ్గర కూడా రిపీట్ చేస్తాడు.అయితే ఇక్కడ చెన్నై మురుగన్ ఒక ఈవిల్ ప్లాన్ వేస్తాడు.. పార్ట్ వన్ లో చెప్పినట్టు అంత మంచి గ్రేడ్ ఎర్ర చందనం దొరికే ప్లేస్ పుష్ప కి మాత్రమే తెలుసు సో ఆ ప్లేస్ తెలుసుకోవడానికి పార్ట్నర్షిప్ డీల్ ఓకే అంటాడు..
మురుగన్ అయితే ఎప్పుడూ పైకి ఎదగాలి అని చూస్తూ ఉండే పుష్ప ఒక పాయింట్ ఆఫ్ టైం లో చెన్నై మురుగన్నే కాదని డైరెక్ట్ గా ఫారెన్ కంట్రీస్ కి ఈ ఎర్రచందనాన్ని ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు.. మనకి ఆల్రెడీ రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా చూడొచ్చు వీటి మీద పుష్ప లోగో కూడా ఈ కంటైనర్స్ మీద ఉంది..అంటే పుష్ప తన ఓన్ గా ఎక్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు సో మురుగన్కి కూడా ఎలాగైనా పుష్పని నాశనం చేయాలని ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తాడు..
అయితే ఇది ఇలా అవుతూ ఉంటే ఆ సంపాదించిన డబ్బులతో పుష్ప మంచి మంచి పనులు చేస్తూ ఉంటాడు అన్నమాట అక్కడ ఉండే పేదవాళ్ళకి ఫైనాన్షియల్ గా గాని ఇంకా చదువుకోవడానికి గాని చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు.. ఇలా మంచి పనులు చేస్తూ జనాల్లో చాలా పాపులర్ అయిపోతాడు..పుష్ప అంటే ఒక దేవుడి లాగా జనాలు చూస్తూ ఉంటారు..తన హ్యాండ్ నే ఒక బ్రాండ్ గా క్రియేట్ చేసుకొని ఒక చిన్న టైప్ ఆఫ్ గవర్నమెంట్ ని రన్ చేస్తూ ఉంటాడు..అయితే ఇది ఇలా ఉండగా పుష్ప మీద పగతో రగిలిపోతున్న బన్వర్ సింగ్ పుష్ప గ్యాంగ్ ని మొత్తం ఎలాగైనా అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు..
పుష్ప చేస్తున్న ఈ మంచి పనుల వల్ల పుష్ప కి పాపులారిటీ పెరిగిపోతూ ఉంటుంది. ఇది మన ఎమ్మెల్యే అయిన సిద్దప్ప నాయుడుకి నచ్చదు ఇక్కడ సిద్దప్ప నాయుడు కూడా చూసి చూసి ఒక పాయింట్ లో బన్వర్ సింగ్ కి ఫుల్ పవర్స్ ఇస్తాడు.. పుష్ప చాప్టర్ క్లోజ్ చేయడానికి అయితే ఆ పవర్స్ తో బన్వర్ సింగ్ పుష్ప గ్యాంగ్ లో ఉన్న ఒక్కొక్కడిని పట్టుకుంటూ ఉంటాడు.. ఇంకా ఎలాగైనా పుష్పని పట్టుకోవాలి అని ట్రై చేస్తున్న పుష్పని పట్టుకోవడానికి ఎక్కడ ప్రూఫ్స్ దొరకవు పుష్ప కోసం మేమంటే మేము జైలుకి వెళ్తామని అందరూ ముందుకు వస్తూ ఉంటారు…
ఇలా కాకుండా వేరే దారిలో పుష్పని అరెస్ట్ చేయాలి అని పుష్ప కి ఉన్న weekness లు అన్నీ వెతకడం స్టార్ట్ చేస్తాడు.. పుష్ప కి ఉన్న వీక్నెస్ రెండే రెండు ఒకటి శ్రీవల్లి, రెండు పుష్ప వాళ్ళ అమ్మ, వాడిని ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు.. కాని పుష్ప వాడిని కాపాడుకుంటూ ఉంటాడు..
అయితే ఇక్కడ ప్లానింగ్ అంతా బన్వా సింగ్ ఇంకా పుష్ప కి ఉన్న మిగతా ఎనిమీస్ అందరూ కలిసి చేస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీవల్లి మీద జాలి రెడ్డికి కూడా చాలా పగ ఉంది..ఎందుకంటే తన వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని సో ఇలా ఒక పెద్ద ప్లాన్ వేసి శ్రీవల్లి ని ఎత్తుకు పోయి..పుష్పని ఒక రాత్రి ఒక చోటకు రప్పించేలా చేస్తారు. అక్కడికి రప్పించి పుష్ప ని షూట్ చేస్తారు ఇక్కడ మన మూవీ లో ఇంటర్వెల్ వస్తుంది..
అయితే పుష్ప అక్కడి నుంచి ఎలాగో తప్పించుకొని పారిపోతాడు అని ఇంటర్వెల్ తర్వాత మనకు తెలుస్తుంది..కానీ తెల్లవారు జాము చూడగానే పుష్ప బట్టలు రక్తంతో కనిపిస్తాయి..ఇంకా పుష్ప చనిపోయాడు అని అందరూ డిసైడ్ అయిపోతారు.. ఇక్కడే మనకి టీజర్ లో చూపించిన విధంగా జనాలు ధర్నాలు చేయడం షాపులు తగలబెట్టడం జరుగుతుంది.. కానీ ఒక నైట్ క్యాంప్ లో పుష్ప సడన్ గా కనిపిస్తాడు అన్నమాట ఇక్కడ ఏం జరిగింది అంటే దెబ్బలతో తప్పించుకున్న పుష్ప ఎలాగో కోలుకొని…
ఆ ఊరి మీద ఒక కన్ను వేసి ఉంచాడు ఇక్కడ రివీల్ అయ్యే విషయం ఏంటంటే పుష్పని ఎన్కౌంటర్ చేయడంలో వీళ్ళందరికీ సహాయం చేసేది మరెవరో
కాదు పుష్ప కి నమ్మకంగా ఉండే కేశవ అంత టైట్ సెక్యూరిటీ ఉండే పుష్ప హౌస్ కి వచ్చి శ్రీ వల్లిని ఎత్తుకుపోయారు..అంటే అదంతా కేశవ చేసిన ప్లాన్ అయితే పారిపోయిన పుష్ప అసలు ఏం జరుగుతుంది అని రకరకాలుగా వేషాలు వేసుకొని గమనిస్తూ ఉంటాడు….
అలా ఒక్కొక్కడిని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు..కొందరిని చంపేస్తాడు కూడా అలా ఒకసారి మంగళం సీను ఇంకా దాక్షిని గంగమ్మ తల్లి జాత్రకి వస్తే అక్కడికి వస్తాడు మన పుష్ప అక్కడే జనమందరి ముందు పుష్ప ఇస్ బ్యాక్ అని గట్టిగా చూపిస్తాడు..ఇంకా ఈ ఫైట్ అయితే థియేటర్స్ లో పిచ్చెక్కిపోతారు ఆడియన్స్ అనిపిస్తుంది..
ఇదంతా అయ్యాక మళ్ళీ పుష్ప మాయమైపోతాడు.. ఎక్కడికో అండ్ బన్వర్ సింగ్ కూడా ఆ టైం కి పుష్పని పట్టుకోలేకపోయాను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు… ఇలా బాధపడుతూ ఉండగా వెనక నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే అదే మన పుష్ప అక్కడ బన్వర్ కి అండ్ పుష్ప కి ఫైట్ జరుగుతుంది…
ఇంకా ఈ ఫైట్ లో బన్వర్ ని పుష్ప చంపేస్తాడు ఇక్కడితో మూవీ ఎండ్ అయింది అనుకుంటాం కానీ కట్ చేస్తే చెన్నై మురుగన్ దగ్గరికి జపాన్ నుంచి ఒక బ్యాచ్ వస్తారు..మాకు ఒక పర్సన్ ని చంపాలి అని ఫోటో చూస్తారు..అది చూసి మురుగన్ షాక్ అవుతాడు అది ఎవరో కాదు మన పుష్పనే అసలు వీడు మీకు ఎందుకు అని మురుగన్ ఆ జపాన్ వాళ్ళని అడుగుతాడు…
అప్పుడు వాళ్ళు పుష్ప ఇంటర్నేషనల్ గా చేస్తున్న పనులు అండ్ ఇంటర్నేషనల్ గా కూడా ఎన్ని దేశాల్లో తనకి క్రేజ్ ఉంది అని వాళ్ళు అక్కడ మురుగనికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు…. ఇక్కడితో పార్ట్ 2 ఎండ్ అయ్యి పార్ట్ 3 కి హింట్ ఇస్తారు…
ఇది మన స్టోరీ ప్రిడిక్షన్ అన్నమాట ఇది కచ్చితంగా రాబోయే మూవీ లో ఉంటుంది అని అయితే నేను చెప్పను బట్ ఒక 50% అయినా ఈ లైన్స్ లో స్టోరీ ఉండబోతుంది అని నాకు అనిపిస్తుంది…
మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి మీకు గనుక మా blog నచ్చుంటే లైక్ చేసి,, ఇంస్టాగ్రామ్, facebook ని ఫాలో అయ్యి, నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి…ఇలాంటి బ్లాగ్స్ కోసం jfori.
Thanks for reading Pushpa-2 Movie Prediction
జై హింద్ జై భారత్